విశాఖపట్నంలో జరగుతోన్న డీప్ టెక్ సమ్మిట్ 2024లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ వేదికగా కొత్త నినాదం అందుకున్నారు. ఏఐ, ఎంఐ, క్వాంటం కంప్యూటింగ్‌తో ఆర్థిక, విద్య, వైద్య రంగాల్లో మార్పులపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు డోలా బాల వీరాంజనేయులు, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ టెక్నాలజీ మన జీవితంలో భాగమైపోయిందన్నారు. టెక్నాలజీ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతోందన్న ఆయన సాంకేతికతతో అనేక మార్పులు వస్తున్నాయన్నారు. ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మార్చాలని అనుకుంటున్నాం అన్నారు. ఇప్పుడు డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణగా అభిర్ణించారు. ఇక, ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త, ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలనే నినాదం తీసుకున్నామని వెల్లడించారు ఏపీ సీఎం.
విశాఖపట్నంలో డీప్ టెక్ సమ్మిట్..
