మరో వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలు ఓ కురుక్షేత్ర యుద్ధమని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ చెప్పారు. కేవలం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎంపిక చేసుకునే ఎన్నికలు కావని, ఇవి ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని జగన్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేస్తే సంక్షేమ పథకాల కొనసాగింపునకు ఓటు వేసినట్లేనని జగన్ తెలిపారు. అదే చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాల ముగింపునకు ఓటు వేసినట్లేనని, నిద్రపోయిన చంద్రముఖిని మళ్లీ లేపి ఇంటికి తెచ్చుకున్నట్లు అవుతుందని జగన్ వివరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా మాచర్ల సభలో పాల్గొని మాట్లాడారు. ఈ ఐదేళ్ల కాలంలో 2 లక్షల 70 వేల కోట్ల రూపాయల్ని సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు నేరుగా అందించామని జగన్ చెప్పారు. రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలను కల్పించామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా వైద్య నియామకాలు చేపట్టామని ఆయన తెలిపారు.
ఏపీలో జరిగే ఎన్నికలు ఓ కురుక్షేత్ర యుద్ధం: ఏపీ సీఎం జగన్
