జగన్‌పై కక్ష సాధింపు కోసం విమర్శలు చేస్తోందనే ఆరోపణలు..

sharmila-2.jpg

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకుని 8 నెలలు కావస్తున్నా పార్టీ ఇంకా బాలారిష్టాలే దాటలేదు. కాంగ్రెస్ పార్టీకు పునర్ వైభవం ఆశలు కాస్తా నెరవేరే పరిస్థితి కన్పించడం లేదు. రాష్ట్ర విభజన తరువాత చెల్లాచెదురైన పార్టీ నేతలు, కార్యకర్తల్ని కూడా సమీకరించలేని పరిస్థితి నెలకొంది. వైఎస్ షర్మిల నేతృత్వంలో పార్టీ పరిస్థితి మూడు అడుగులు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. దీనికితోడు వైఎస్ షర్మిలపై సొంతపార్టీలో వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అంతా తానై ఒంటెద్దు పోకడలకు పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ  అంతర్గత నిర్మాణంలోనే కాదు రాజకీయంగా కూడా సరైన ప్రతిపక్షంగా రాణించలేకోపోతోంది. పార్టీలో సీనియర్లను ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి. 

ఇక పార్టీ విధానాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం వ్యక్తిగత ఎజెండాతోనే ముందుకు పోతోందనే ప్రచారం సాగుతోంది. కేవలం అన్న జగన్‌పై కక్ష సాధింపు కోసం విమర్శలు చేస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పార్టీ నాయకురాలిగా కూటమి ప్రభుత్వం వైఫల్యాలు, పనితీరుపై ఇప్పటి వరకూ విమర్శలు చేయకపోవడంతో కుమ్మక్కయ్యారనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షం వైసీపీ తప్ప అధికార పార్టీలో ఎందుకు దూకుడు ప్రదర్శించడం లేదనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. 

Share this post

scroll to top