హిందువుల గురించి మాట్లాడితే ప్రకాశ్ రాజ్ కు సంబంధం ఏంటి అని పవన్ ప్రశ్నించారు. నేను హిందూ దేవాలయంలో అపవిత్రత గురించి మాట్లాడాను. ఇందులో ప్రకాశ్ రాజ్ కు సంబంధం ఏమిటి. నేను వేరొక మతాన్ని నిందిచానా ఇస్లాం, క్రిస్టియన్ మతాల గురించి ఏమైనా తప్పుగా మాట్లాడానా తిరుపతిలో అపవిత్రం జరిగింది. ఇలా జరగకూడదని చెబితే అది తప్పు ఎలా అవుతుంది. తప్పు జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శిరచ్ఛేధనం చేస్తే మాట్లాడొద్దా ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కరికి. ఎవరికోసం మాట్లాడుతున్నారు. మీరు ప్రకాశ్ రాజు అంటే నాకు గౌరవం ఉంది. నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు. మాట్లాడితే సెక్యూలరిజంకు విఘాతం అంటే ఏమిటి అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సనాతన ధర్మంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇస్లాం మీద మీరు మాట్లాడగలారా జీసెస్ మీద మాట్లాడగలరా ప్రతీసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం. నోటికొచ్చినట్లు మాట్లాడితే క్షమించేది లేదని పవన్ అన్నారు.
ప్రకాశ్ రాజ్ పై పవన్ ఫైర్..
