చెత్తలో కూడా ఐశ్వర్యం ఉందని చెప్పడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం..

pspk-12.jpg

అమరావతిలో సాలిడ్, లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ – ఎస్ఎల్ఆర్ఎం వర్క్ షాపులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఎస్ఎల్ఆర్ఎంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన అధికారులు.. భీమవరం, పిఠాపురం, గొల్లప్రొలులో ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టు అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. చెత్త నుంచి వివిధ ఉత్పతులకు ముడి సరుకు తయారు చేయొచ్చని అధికారులు తెలిపారు. డ్రైనేజ్ టు డైమండ్ అనే కాన్సెప్టుతో ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టును రూపొందించామని ఎస్ఎల్ఆర్ఎం రిసోర్స్ ప్రతినిధి శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఈ వర్క్ షాప్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పంచభూతాల్లో నీరు ఉంది.. కానీ ఆ నీటిని మనం పూజలకే ఉపయోగిస్తాం తప్ప.. నీటిని శుభ్రంగా ఉంచం.. 12 గంటల్లో చెత్తను కలెక్ట్ చేయగలిగితే చెత్తే సంపద అవుతుంది.. పనికి రాని చెత్త వేరే అవసరాలకు సంపదగా మారుతుంది.. శ్రీనివాసన్ గత రెండు దశాబ్దాలుగా ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టు మీద పని చేస్తున్నారు.. పిఠాపురంలో తొలిసారిగా ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టు చేపట్టనున్నాం.. ప్రజలూ ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టులో భాగస్వాములు కావాలి అని ఆయన పిలుపునిచ్చారు.

Share this post

scroll to top