జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధం అయ్యారు. నేటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో బహిరంగసభలు, రోడ్‌షోలలో పాల్గొననున్నారు పవన్. మొత్తంగా మహారాష్ట్రలో రెండు రోడ్ షోలు, ఐదు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు ఏపీ డిప్యుటీ సీఎం. తొలి రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు పవన్ కల్యాణ్.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్న ఆయన ఐదు బహిరంగ సభలు రెండు రోడ్ షోలలో పాల్గొంటారని జనసేన ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండగా ఇతర రాష్ట్రాల్లోనూ అవసరాలను బట్టి ఏపీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.