తల్లులకు పంగనామాలు ప్రైవేటు స్కూళ్ల తాఖీదులు..

lokesh-3.jpg

తల్లులకు వందనం అంటూ చంద్రబాబు, లోకేష్‌లు ఈ ఏడాది ఇవ్వాల్సిన అమ్మకు వందనం డబ్బులు ఎగ్గొట్టారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ నెలకు రూ.15వేలు ఇస్తానని ఈ విద్యాసంవత్సరంలో తల్లులందరికీ పంగనామాలు పెట్టారు. అమ్మకు వందనం వస్తుందనుకుని ఆడబ్బును మినహాయించి మిగిలిన డబ్బు కట్టించుకుని అనేక ప్రైవేటు స్కూల్స్‌ పిల్లలను చేర్పించుకున్నాయి. ఇప్పుడు ఇలా జాయిన్‌చేసిన తల్లిదండ్రులు చంద్రబాబు, లోకేష్‌ల మోసపూరిత హామీ కారణంగా బాధలు పడుతున్నారు. ఈ ఏడాది అమ్మకు వందనం లేదని తేల్చేసినందువల్ల ఆ డబ్బులు కూడా కట్టాలని ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు తాఖీదులు ఇస్తున్నాయి

Share this post