నేటి నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పులు రానున్నట్లు ప్రభుత్వం ముందే ప్రకటించింది. గ్రోత్ సెంటర్ల ఆధారంగా 0-20 శాతం వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇదివరకే తెలిపారు. ఈ క్రమంలో గత రెండు నుంచి పెద్ద ఎత్తున కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ధరలు పెరగకముందే చాలా మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే ఒక్కసారి ఎక్కువ మంది కావడంతో కొన్ని చోట్లు సర్వర్లు పనిచేయలేదు. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యం కావడంతో రాత్రి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్లు అవుతూనే ఉన్నాయి.