ఏపీలో పారిశ్రామిక వాడల్లో పరిస్థితిని చక్కదిద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. గన్నవరం పరిధిలోని మల్లవల్లి, వీరపనేని గూడెం ఇండస్ట్రియల్ పార్కుల్లో మౌళిక వసతుల కల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అశోక్ లేలాండ్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తోంది. మల్లవల్లి పారిశ్రామిక వాడలో త్వరలో అశోక్ లేలాండ్ కార్యకలాపాలు నిర్వహించనుంది. గత ప్రభుత్వంలో వెళ్లిపోయి.. మళ్లీ ఏపీకి తిరిగి రానున్న తొలి సంస్థగా అశోక్ లేలాండ్ నిలవనుంది. అశోక్ లేలాండ్ సహా 10 కంపెనీల ప్రతినిధులతో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంప్రదింపులు జరిపారు. మల్లవల్లిలో త్వరలో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రముఖ ఆచి మసాలా సంస్థ సిద్ధమవుతోంది. విస్తరణ దిశగా హెచ్‌సీఎల్ కంపెనీ ఆలోచన చేస్తోంది. విశాఖ, బందరు, తిరుపతి, అనంత జిల్లాలతో పాటు సీఆర్డీఏ పరిధిలో కంపెనీలను తెచ్చే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళికలు..
