ఏపీ ఎన్నికల సమయంలో కూటమి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన కూటమి ఈ కీలక హామీ అమలుపై కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల బృందం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేసింది. వీటిలో ఏది ఏపీలో అమలుకు వీలవుతుందనే అంశాన్ని పరిశీలించి ప్రాథమికంగా ఓ నివేదికనూ సిద్ధం చేసింది.
ఏపీ మహిళలకు గుడ్న్యూస్.. ఉచిత బస్ ప్రయాణంపై సర్కార్ ఫోకస్
