మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది హైకోర్టు.. దీంతో.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.. సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ఈవీఎం ధ్వంసంతో పాటు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు పల్నాడు పోలీసులు. కాగా, ఆ మూడు కేసుల్లో ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. అయితే, అరెస్టు నుంచి రక్షణ కోరుతూ పిన్నెల్లి బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది హైకోర్టు.. గతంలో నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పోలీసుల తరఫున స్పెషల్ కౌన్సిల్‌గా న్యాయవాది ఎన్.అశ్వినీకుమార్ వాదనలు వినిపించగా.. ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు కొనసాగించారు.. గతంలో తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు.. ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు ఇచ్చింది.. ముందస్తు బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.. పిన్నెల్లి పై ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసులు నమోదు చేశారు పల్నాడు పోలీసులు.. అయితే, ఈ కేసుల్లో ఆయనకు ఊరట కల్పిస్తూ.. ఏపీ హైకోర్టు గతంలో ముందస్తు బెయిల్ ఇచ్చింది.. దీంతో.. ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ పై ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ రోజు హైకోర్టు తీర్పు షాక్ ఇచ్చినట్టు అయ్యింది.. పిటిషన్లు మొత్తం డిస్మిస్ కావడంతో.. పిన్నెల్లిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చే సే అవకాశం ఉందంటున్నారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షాక్..
