vమంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న దాడి జరిగింది. ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల వివరాలను సేకరిస్తున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఇప్పటికే ఐదుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. అయితే గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మొత్తం 56 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించామన్నారు.
ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక ఆదేశాలు..
