అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో పేలుడుపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని మోదీ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పీఎం సహాయ నిధి నుంచి పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. కాగా ఈ ఘటనలో ఇప్పటి వరకూ 18 మంది మృతి చెందగా, మరో 40 మందికి గాయాలయ్యాయి.
అచ్యుతాపురం సెజ్ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
