వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఊహించినట్లే జనసేనలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు మంగళగిరి జనసేన ఆఫీస్‌లో నేడు సమావేశం కానున్నట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇక నిన్న వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు పవన్‌తో భేటీ తర్వాత కార్యాచరణ ప్రకటించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే రాజీనామా ప్రకటించిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేసిన బాలినేని.. వైసీపీ విధానాలు నచ్చకపోవడం వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన గురించి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడంతో పాటు పార్టీ నిర్ణయాల్లో కొన్ని తనకు నచ్చలేదని, అందువల్లే కొద్ది రోజులుగా పార్టీ కార్య దూరంగా ఉంటూ వచ్చానని, ఇక చివరిగా ఇప్పుడు రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఇక ఈ రోజు మీటింగ్‌లో ఒకవేళ పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అనుచరులతో సహా ఆయన జనసేనలో కలిసే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి.