రూ. 2 లక్షల రుణమాఫీ టైం పాస్ గా మారిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచులు బిచ్చగాళ్ళలాగా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ధ్యానం కొనుగోళ్ళు వెంటనే చేబట్టాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ ఎంతమందికి అయ్యింది? అని ప్రశ్నించారు. రెండు లక్షల రుణమాఫి టైం పాస్ గా మారిందన్నారు. మోడీ మీద యుద్ధం చేయడం కాదు, యుద్దప్రాతికనా రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలన్నారు. కుల గణనకి మేం వ్యతిరేకం కాదు, పారదర్శకంగా కులగణన జరగాలని తెలిపారు. అమృత్ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. రూ.7000 కొట్ల రూపాయలు అమృత్ స్కీం ద్వారా తెలంగాణకి నిధుల కెటాయింపు జరిగిందన్నారు. పార్టీలకి అతితంగా అందరం కలిసి నగర అభివృద్ధి చేసుకుందామన్నారు.
టైం పాస్ గా మారిన 2 లక్షల రుణమాఫీ..
