రేవంత్ రెడ్డిని గొప్పనాయకుడన్న పవన్..

bandi-30.jpg

అల్లు అర్జున్ కేసు అంశంపై తొలిసారి మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీరెలా? స్పందిస్తారని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ను మీడియా ప్రతినిధులు సోమవారం ప్రశ్నించారు. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ ఏమన్నారో నాకు తెలియదు. నేను వినలేదు. నిజంగా గొప్ప నాయకుడని అని ఉంటే ఆయనలో ఏం కన్పించిందో అన్నారో తెలియదు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు.

ఏడాదిలో క్రైమ్ రేటు పెరిగింది. ఇలాంటి వ్యక్తి పవన్ కల్యాణ్‌కు ఎలా గొప్పగా కనిపించారో తెలియడం లేదు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు జైలుకు వెళ్లి రావడంతో సమస్య ముగిసింది. మళ్లీ దీనిపై అసెంబ్లీ చర్చ పెట్టడం అనవసరం. ఆరు గ్యారంటీల అమలుపై చర్చ పెట్టాలి. అమలు చేయలేక వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే అల్లు అర్జున్‌ను పావులా వాడారని కీలక వ్యాఖ్యలు చేశారు.

Share this post

scroll to top