షుగర్ ఉన్నవారు డైట్ విషయంలో జాగ్రత్తలు..

sugur-25.jpg

షుగర్ ఉన్నవారు డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. వీటితో పాటు కొన్ని లిక్విడ్స్ తీసుకోవాలి. అందులో హెర్బల్ టీలు ముందంజలో ఉంటాయి. వీటితోపాటు కొన్ని జ్యూస్‌లు కూడా తీసుకోవచ్చు. అవి యాంటీ ఆక్సిడెంట్స్‌తో లోడ్ అయిన డ్రింక్స్ అయితే మరీ మంచివి. వీటి కారణంగా మనం అనేక వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. 

టమాటా జ్యూస్.. మనం వంట్లో వాడే టమాటాల్ని జ్యూస్ చేసి తాగడం వల్ల కూడా టమాటల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిని జ్యూస్‌లా చేసి తీసుకోవచ్చు. దీని వల్ల బీపి కూడా కంట్రోల్ అవుతుంది.

ప్రూనే జ్యూస్.. ప్రూనే ఫ్రూట్స్ మీ జీర్ణక్రియకి చాలా మంచివి. ఇందులో ఎక్కువగా పాలీఫెనాల్స్ వంటి వాపుని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఆకలిని కంట్రోల్ చేసి గట్ హెల్త్, బ్లడ్ షుగర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.

దానిమ్మరసం.. షుగర్ పేషెంట్స్ జ్యూసెస్‌ తీసుకోవద్దని అంటారు. కానీ, షుగర్, ఎక్కువగా నీరు కలపని స్వచ్ఛమైన దానిమ్మరసం తీసుకుంటే అందులో పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది.

కెఫిన్ లేని గ్రీన్ టీ.. కొన్ని గ్రీన్‌ టీలలో కెఫిన్ ఉంటుంది. కాబట్టి, కెఫిన్ లేని గ్రీన్ టీ తాగడం మంచిది. గ్రీన్‌టీలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులోని పాలీఫెనాల్స్ షుగర్ పేషెంట్స్‌లో ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తాయి.

గ్రీన్ స్మూతీ.. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అంటే పాలకూర, కాలే వంటి ఆకుకూరల్ని స్మూతీల్లా చేసి తీసుకోవచ్చు. ఇందులో ఓట్స్, ఫ్రోజెన్ బెర్రీస్, ఆకుకూరలు, ప్రోటీన్ పౌడర్, నాన్‌ఫ్యాట్ గ్రీక్ యోగర్ట్, పీనట్ బటర్‌ని వేసి బ్లెండ్ చేయడమే. ఇందులో చక్కెర అసలే వేయకూడదు.​

Share this post

scroll to top