సంక్షేమ పథకాలపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతోంది. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేమన్న సీఎం మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నానని, ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. అయితే, చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి. చంద్రబాబు అబద్దాల మాటలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు అబద్దాలు చెప్పినందున ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏ గుడిమెట్లు కడుగుతారు. అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు. నీతిఅయోగ్ పేరుతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలేనని మోసం చేశారు అని మండిపడ్డారు భూమన అధికారంలోకి వస్తే 15 వేలు పిల్లలకు, రైతు భరోసా, నిరుద్యోగ భృతి అంటూ హామీలు ఇచ్చి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్దాలు చేబుతున్నారు అని దుయ్యబట్టారు. ఎన్నికలలో ప్రచార సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంటో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు తెలియదా? అని నిలదీశారు. ఎన్నికల సమయంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా వైఎస్ జగన్ కంటే ఎక్కవగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడేమో చేతులేత్తేశారని విమర్శలు గుప్పించారు. ఘోరమైన పాలన చంద్రబాబు చేస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇస్తామని మళ్లీ అబద్దాలు చేబుతున్నాడు.. అబద్దాలు బుద్దుడు ఈ చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.