ఎస్వీ గోశాల గోవధ శాలగా మారింది. ఇది సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన పాపమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతిలోమీడియాతో మాట్లాడిన ఆయన గోవులు దేవుళ్లతో సమానం టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో గోవులు దారుణంగా చనిపోతున్నాయి. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైనది గోమాత హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయం అంటున్న ఎన్డీఏ ప్రభుత్వంలో వందకు పైగా గోవులు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ అధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోశాలలో గత మూడు నెలలుగా వందకుపైగా ఆవులు చనిపోతున్నా పట్టించుకోకుండా ఉన్నారు. ఎస్వీ గోశాలలో గోవులను దుస్థితి దారుణంగా ఉంది. వందకు పైగా ఆవులు చనిపోయాయి. ఆ లెక్కలు, ఆవుల మృతి బయటకు రాకుండా చూశారు. కనీసం పోస్టు మార్టం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. ఈ మహాపాపం టీటీడీది, ప్రభుత్వానిది కాదా ? అని నిలదీశారు.
తిరుమల క్షేత్రంలో మహా పాతకం..
