చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వ ఆగడాలను అరికట్టేందుకు వైసిపి పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరుగుతున్న అరాచకాలపై రాష్ట్రపతి అలాగే గవర్నర్ కు ఫిర్యాదు చేసింది వైసిపి పార్టీ. తమ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు వందకు పైగా అక్రమ కేసులు బనాయించారని ఫిర్యాదు చేసింది వైసీపీ పార్టీ. ఏకంగా రాష్ట్రపతి అలాగే గవర్నర్ల కు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడే సౌకర్యం కూడా లేదని స్వేచ్ఛగా భావ ప్రకటన చేసే హక్కు కూడా లేదని రాష్ట్రపతి అలాగే గవర్నర్ కు ఫిర్యాదు చేసింది వైసిపి పార్టీ. కస్టడీలో ఉన్న వైసీపీ కార్యకర్తలను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసింది వైసిపి. తమ కార్యకర్తల ప్రాథమిక హక్కులను భంగం చేసి మరి అరెస్టు చేశారని నిప్పులు చెరిగింది. అక్రమ కేసులను ఎత్తివేయాలని ఎత్తివేయాలని డిమాండ్ చేసింది.