రూ.15 లక్షలు ఖర్చుపెట్టేందుకు వెనకాడని నబీల్..

BIGG-BOSS-3.jpg

పదేపదే పోట్రే చేస్తున్నానని నాపై లేనిపోని నింద వేశావంటూ నిఖిల్ను రేసులో నుంచి తీసేయాలనుకున్నాడు. నిఖిల్ స్పందిస్తూ వచ్చినప్పటినుంచి నువ్వు అదే చేస్తున్నావని వాదనకు దిగాడు. ఈ క్రమంలో గౌతమ్ యష్మిని వాడుకుంది నువ్వు, అమ్మాయిలను వాడుకున్నావ్ అంటూ నీచంగా మాట్లాడాడు. ఇలానే మరోసారి కాస్త వల్గర్గా మాట్లాడటంతో నిఖిల్ కోపాన్ని అణుచుకోలేకపోయాడు. ఇంకోసారి నోరు జారి మాట్లాడితే బాగోదని హెచ్చరించాడు. ఈ గొడవను ఆపేయమని చెప్తున్నా కూడా గౌతమ్ వినకుండా విషయాన్ని సాగదీస్తూనే ఉన్నాడు. యష్మికి గాజులు సెట్ చేస్తూ ఆమెకు హెూప్స్ పెట్టడం తప్పంటూ తన వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి మరింత ఇరిటేషన్ తెప్పించాడు. అనంతరం నిఖిల్.. నామినేషన్స్లోకి రాలేదంటూ రోహిణిని రేసు నుంచి తప్పించాడు. నామినేషన్స్లోకి రాకపోయినా నేను అన్ని గేమ్స్ గట్టిగానే ఆడాను అని రోహిణి సమాధానమిచ్చింది. చివర్లో ప్రేరణ, నబీల్ ఇద్దరు మాత్రమే మిగిలారు, వీరికి బిగా బాస్ బంపరాఫర్ ఇచ్చాడు.

మీ ముందున్న చెక్పై రూ.15 లక్షల వరకు ఎంతైనా రాసి ఇమ్యూనిటీ కొనుక్కోవచ్చన్నాడు. ఆ డబ్బు ఉన్నర్ ప్రైజ్ మనీలో నుంచి కట్ అవుతాయన్నాడు. కాసేపు ఆలోచించుకున్నాక ఇద్దరూ తమకు తోచినంత అమౌంట్ రాశారు. ఇంతలో మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్బాస్. ఇమ్యూనిటీ కొనుక్కోకుండా వారిని నామినేషన్స్ లో ఉంచేందుకు హౌస్మెట్స్ ఒప్పించవచ్చన్నాడు. ప్రేరణ.. రూ.4,30,000 రాయగా నబీల్ ఏకంగా రూ.15 లక్షలు రాసేశాడు. అది విని హౌస్మేట్స్ నోరెళ్లబెట్టారు. కంటెస్టెంట్లే కాదు చూసే జనాలు కూడా వీళ్లు ఇంత స్వార్థంగా ఉన్నారేంటని ఈసడించుకోవడం ఖాయం. ఏదేమైనా వీరిద్దరూ మనసులు మార్చుకుని చెక్కులు చించేయడంతో నేరుగా ఫైనల్ కు వెళ్లే అవకాశం కోల్పోయారు. ఈ వారం గౌతమ్, రోహిణి, నిఖిల్, విష్ణుప్రియ, ప్రేరణ, నబీల్ నామినేషన్స్ ఉన్నారు.

Share this post

scroll to top