ప్రైజ్ మనీ, పారితోషికంతో పాటు ఏమేం అందుకున్నాడంటే..

bigg-boss-16.jpg

సుమారు 3 నెలల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముగిసింది. సెప్టెంబర్ 01న ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు ఆదివారం తో ఎండ్ కార్డ్ పడింది. నిన్న గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్టుగా హాజరయ్యాడు. అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్, టాప్ -5 కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులతో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోలాహాలంగా సాగింది. ఇక టాప్ -5లో మొదట అవినాశ్ ఎలిమినేట్ కాగా ఆ తర్వాత ప్రేరణ, నబీల్ బయటకు వచ్చేశారు. దీంతో టాప్ -2లో గౌతమ్, నిఖిల్ నిలిచారు. ఆఖరికి మొదటి నుంచి టైటిల్ ఫేవరేట్ గా ఉన్న నిఖిల్ ను బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా ప్రకటించారు.

డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. పేరుకు కన్నడ నటుడే అయినా తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు నిఖిల్. కంటెస్టెంట్స్ సూటి పోటి మాటలు అన్నా ఆటతోనే సమాధానం చెప్పాడు. ఇక ఫిజికల్ టాస్కుల్లో అయితే నిఖిల్ కు తిరుగులేకుండా పోయింది. దీంతో మొదటి నుంచి ఈ సీరియల్ నటుడిని బిగ్ బాస్ టైటిల్ ఫేవరేట్ గా భావించారు. ఇప్పుడు అదే నిజమైపోయింది. ఆదివారం జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీతో పాటు రూ. 55 లక్షల చెక్కు అందుకున్నాడు నిఖిల్. ఇక గెలిచిన తర్వాత తన విజయాన్ని తల్లిదండ్రులకు అంకితం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు.

Share this post

scroll to top