మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ కన్నుమూత..

bjp-29.jpg

మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన ఉదయం తన ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు మొదటగా ఆదిలాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ క్రమంలో.. హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఆయన స్వస్థలం ఉట్నూరుకు రమేశ్ రాథోడ్ మృతదేహం తరలించారు. రమేష్ రాథోడ్ మృతి పట్ల బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

1999లో ఖానాపూర్ అసెంబ్లీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2006 నుంచి 2009 మధ్య ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ గా పనిచేశారు. మళ్లీ 2014లో ఖానాపూర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేశారు. 2021లో ఈటల రాజేందర్ తో కలిసి బీజేపీలో చేరారు.

Share this post