మూడు దశల్లో లక్ష కోట్లతో అమరావతి నిర్మాణం తొలి విడత నిర్మాణం కోసం రూ 48 వేల కోట్లు ఖర్చు
పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం. 2017లో అమరావతి మొదటి దశ కోసం 1.09 లక్షల కోట్లు కావాలని నాటి మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పాడు. ఆ మేరకు అప్పటి సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాసాడు 2014 -19 మధ్య అమరావతి కి కేంద్రం ఇచ్చిన 2,500 కోట్లు కాకుండా అధిక వడ్డీకి బాండ్ల రూపం లో 2వేల కోట్ల అప్పు తెచ్చిన బాబు 2019 ఎన్నికల్లో ఓడిపోయాక తూచ్ అసలు అమరావతికి బయటనుంచి ఒక రూపాయి అక్కరలేదు అది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని బాబు చెప్పాడు. ఇప్పుడేమో 15వేల కోట్లు అప్పు తీసుకుంటున్నారు. అమరావతికి లక్ష కోట్లు కావాలని ఒకసారి అవసరం లేదు అని ఇంకోసారి
మరలా ఇప్పుడు అమరావతికి అప్పు కావాలని ఇన్ని యూ టర్న్ లా బాబూ కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోవడంతో ఈ రోజు టీడీపీ జనసేన ఎంపీల మద్దతు మీద ఆధారపడి ఉంది. చక్రం తిప్పి 15వేల కోట్లు గ్రాంట్ గా తెచ్చుకోకుండా అప్పు తెచ్చుకోవడం ఏంటి అని అనుకుంటున్నారు.
అమరావతికి కేంద్రం ఇప్పించే 15వేల కోట్లు అప్పే.. బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్..
