పురంధేశ్వరి ప్రత్యేక చొరవ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగినట్టేనా.?

vizag-28.jpg

వైజాగ్ స్టీల్ ప్లాంట్‎ను ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని ఆంధ్రపదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రయత్నిస్తున్నారు. అందుకే ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి కేంద్రాన్ని కోరుతున్నారు. లాభాల బాటలో నడిపేందుకు సహకరించాలని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామిని తాజాగా దగ్గుబాటి పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు. అందుకు స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడమే అత్యుత్తమ ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు. మరి పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుని, పురంధరేశ్వరి ప్రతిపాదనను అంగీకరిస్తుందా? లేదా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని బీజేపీలోని కేంద్ర వర్గం ఒకలా ఆలోచిస్తుంటే రాష్ట్ర వర్గం మాత్రం ఇంకోలా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కార్మికులు దాదాపు మూడు సంవత్సరాలకుపైగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ కేంద్రం ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన నిర్ణయం కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్‎కు మాత్రమే కాకుండా మిగతా అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించింది. కాబట్టి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే ఉండదన్నది ప్రభుత్వ వర్గాల వాదన. వైజాగ్ స్టీల్స్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కన్సల్టెన్సీ, లీగల్ అడ్వైజర్, ట్రాన్సాక్షన్ అడ్వైజర్ అన్నీ నియమించే ప్రయత్నం చేసారు.

Share this post

scroll to top