జనవరి నాటికి బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు..

bjp-22.jpg

జనవరి నాటికి బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రాల్లోనూ అధ్యక్షులు మారనున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల కసరత్తును ప్రారంభించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో జాతీయ అధ్యక్షుడితో పాటు కొన్ని రాష్ట్రాల అధ్యక్షుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ పార్టీ తీర్మానం చేసింది. ఇప్పుడు బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు లోబడే మార్పులు చేర్పులు జరుగుతాయి.

బీజేపీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ను ఎంపిక చేశారు. బూత్ కమిటీల నుంచి ప్రారంభం చేసి రాష్ట్ర స్థాయి, జాతీయస్థాయి ఎన్నికలను నిర్వహించనున్నారు. పార్టీ కొత్త కమిటీల ఎన్నికల్లో క్రియాశీలక సభ్యులదే కీలకపాత్ర. మూడు నెలల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయనున్నారు. ఇక, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Share this post

scroll to top