జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్ విలీనంపై బోర్డు మెంబర్ రియాక్షన్!

hyd-08.jpg

జీహెచ్‌ఎంసీలో (GHMC) కంటోన్మెంట్‌ను విలీనం వ్యవహారంపై కంటోన్మెంట్ బోర్డు మెంబర్ రామకృష్ణ స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు ఘన చరిత్ర ఉందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కంటోన్మెంట్‌ను చిన్న చూపు చూశాయన్నారు. కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం జీహెచ్‌ఎంసీలో విలీనంపై ప్రచారం మొదలు పెట్టారని విమర్శించారు. 80% కంటోన్మెంట్ ప్రజలు జీహెచ్‌ఎంసీలో విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. గతంలో బీఆర్‌ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కంటోన్మెంట్ భూములపై కన్నేశారని ఆరోపించారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం చేస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్నారు.

Share this post

scroll to top