ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బొబ్బిలికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. బొబ్బిలి అనగానే నాడు వీరోచితంగా జరిగిన బొబ్బిలి యుద్ధం అందరి మదిలో మెదులుతుంది. 1757లో విజయనగరం గజపతిరాజులకు, బొబ్బిలి రాజులకు మధ్య జరిగిన యుద్ధం.. వందల ఏళ్లు గడిచినా ఇప్పటికీ నాటి చారిత్రక ఆనవాళ్లు దర్శనమిస్తుంటాయి. అయితే కాలక్రమంలో రాజుల రాజరికం కనుమరుగై ప్రజాస్వామ్యం అమలులోకి వచ్చింది. అయితే ప్రజాస్వామ్యంలో కూడా విజయనగరం గజపతిరాజులు, బొబ్బిలి రాజులు తమ ప్రాభల్యాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం బొబ్బిలి రాజుల వారసులే బొబ్బిలి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2004 నుండి 2019 వరకు మూడుసార్లు బొబ్బిలి నుండి సుజయకృష్ణ రంగారావు ఎమ్మెల్యేగా ఉండగా, ప్రస్తుతం 2024లో సార్వత్రిక ఎన్నికల్లో సుజయ కృష్ణ రంగారావు సోదరుడు ఆర్ వి ఎస్ కె కె రంగారావు అలియాస్ బేబీనాయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన పార్టీలో అత్యంత క్రియాశీలంగా వ్యవహరించారు. బొబ్బిలితో పాటు పక్క నియోజకవర్గాల్లో సైతం వీరి ప్రాబల్యం ఉంటుంది. ప్రస్తుత ఎన్నికల్లో ఇటు బేబీ నాయన, అటు ఆయన సోదరుడు మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ లో తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. ఆయన అనుచరులు కూడా మంత్రి పదవి వస్తుందని ధీమాగా ఉన్నారు. కానీ ఆఖరి నిమిషంలో బేబీనాయనకు మంత్రి పదవి దక్కలేదు. అయినా పార్టీ నిర్ణయం మేరకు మౌనం వహించారు. తమ అభిమానులకు సైతం ఎక్కడా పార్టీ పై తప్పుగా మాట్లాడొద్దని సూచించారు.
అమ్మకిచ్చిన మాట తప్పా.. అందుకే మంత్రిని కాలేకపోయా.. బొబ్బిలి ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..
