విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమనేతలపై జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి ఏం చేయాలో అదంతా టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం చేస్తోందని, పోరాటం పేరుతో ఉద్యమనేతలంతా కబుర్లు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు ఉద్యమనేతలంతా బొలిశెట్టిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన బొలిశెట్టి మరోసారి ఉద్యమనేతలపై విరుచుకుపడ్డారు.
మరోసారి విమర్శలు చేసిన బొలిశెట్టి..
