టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు నితిన్ సరసన ఆమె నటించిన రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ దగ్గరపడింది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇటు తెలుగులోనే కాకుండా అటు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటుంది శ్రీలీల. కొన్నాళ్లుగా ముంబైలో పలు మూవీ ఈవెంట్స్, పార్టీలలో కనిపిస్తుంది ఈ అమ్మడు. ఇటీవలే సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ తో సన్నిహితంగా కనిపించింది. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందంటూ ప్రచారం నడిచింది. కట్ చేస్తే హిందీలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు శ్రీలీల పర్సనల్ విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం ఆమె డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శ్రీలీల ఇప్పుడు బీటౌన్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రేమలో ఉందని టాక్ నడుస్తుంది. వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ ఫిల్మ్ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారు. డైరెక్టర్ అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లవ్ స్టోరీగా ఉండనున్నట్లు టాక్. అయితే ఈ మధ్యే కార్తీక్ ఆర్యన్ ఇంట్లో ఫ్యామిలీ మొత్తం కలిసి పార్టీ చేసుకుంటే శ్రీలీల కూడా అక్కడ కనిపించింది.