ఇంటిపేరు మార్చుకున్న అలియా

aliya-16.jpg

బాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో బ్యూటీ అలియా ఒకరు. ఈ భామ తన అందం, అభినయంతో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసిందనడంలో ఎటువంటి అతిశక్తిలేదు. పెళ్లై ఓ పాపకు జన్మనిచ్చిన కూడా ఈ అమ్మడు గ్లామర్ తగ్గలేదు. ఇప్పటికీ ఈ బ్యూటీ కుర్రాళ్ల ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్‌. అలియా తన ఇంటిపేరును మార్చుకోబోతున్నారనే చర్చ ప్రారంభమైంది. రీసెంట్‌గా గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 2 కు హాజరైన అలియా ఇంటి పేరును మార్చుకోవడంపై క్లారిటీ ఇచ్చింది. ఆమె తన పేరు కు కపూర్‌ ని చేర్చుకున్నారా లేదా రణ్ బీర్ చేర్చుకుంటారా? అనే సందేహాలపై అభిమానులకు స్పష్టత ఇచ్చింది. ఆలియా తన కొత్త చిత్రం ‘జిగ్రా’ ప్రమోషన్స్ లో భాగంగా తన జిగ్రా టీమ్ తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సమయంలో ‘ హాయ్ అలియా భట్’ అంటే దానికి అలియా బదులిస్తూ.. ‘మే హూన్ అలియా భట్ కపూర్’ అని చెప్పింది. ఆ కొత్త పేరు విన్న టీం మాత్రమే కాకుండా ఫ్యాన్స్ కూడా షాకయ్యారు.

Share this post

scroll to top