విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణపై మీ విధానం ఏమిటి బాబూ..

botcha-02.jpg

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణపై తమ ప్రభుత్వ వైఖరి ఏంటో, విధానమేంటో ప్రజలకు, కార్మికులకు స్పష్టం చేయాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగనీయబోమని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, ఇప్పుడు ప్లాంట్‌కు సంబంధించి వేగంగా జరుగుతున్న పరిణామాలకు సమాధానం చెప్పాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడం, పండుగ బోనస్‌ ఇవ్వక పోవడం, బలవంతపు వీఆర్‌ఎస్‌ అమలు చేస్తుండటం, బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు వరుసగా మూసి వేస్తుండటం వంటి పరిణామాలు చూస్తుంటే.. ఉక్కు పరిశ్రమ భవిష్యత్తుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. శ‌నివారం విశాఖపట్నంలో మాజీ మంత్రి అమ‌ర్నాథ్‌తో క‌లిసి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

Share this post

scroll to top