సభలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. కానీ, ప్రభుత్వం మార్షల్స్ ను తెచ్చి మమ్మల్ని సభ నుంచి బయటికి పంపించేందుకు చూసిందని ఆరోపించారు. సూపర్ సిక్స్ కు నిధులు కేటాయించకుండా కాలక్షేపం చేస్తోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదు ఓటేశారు. మేం గెలిచాం ఇక దోచుకుంటే సరిపోతుందనే భావనలో ఈ ప్రభుత్వం ఉంది. 15 రోజుల సభలో ప్రభుత్వ తీరును మేం ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మంచి చేస్తారని మేం ఆశిస్తున్నాం ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం లేదు వర్గీకరణ కోసం షెడ్యూల్ కులాలు పోరాడుతున్నాయి. వర్గీకరణ కోసం పోరాడిన వారిపై టీడీపీ కేసులు పెట్టింది. ఆ కేసులను ఎత్తేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని బొత్స సత్యనారాయణ తెలిపారు.
కూటమి సర్కార్ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పట్టించుకోవడం లేదు..
