నాన్‌స్టాప్‌గా చేరికలు.. కాంగ్రెస్‌లోకి మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

non-13.jpg

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికల ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి హస్తం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. ఆ సంఖ్య మరింత పెరుగుతోంది. నిన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. నేడు మరో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హస్తం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరికలు ఇంతటితో ఆగనట్లు కనిపిస్తోంది. మరికొంత మంది కూడా బీఆర్‌ఎస్‌ను వీడిన వారి బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది.

Share this post

scroll to top