మరోసారి కోర్టుకు కవిత.. బెయిల్‌ వచ్చేనా..

kavitha-08.jpg

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ కేసులో డిఫాల్ట్‌ బెయిల్‌ కోరుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత.. రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో, ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. కాగా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో బెయిల్‌ విషయమై మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో డిఫాల్ట్‌ బెయిల్‌ కోరుతూ కవిత సోమవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో గురువారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించి​ంది. ఈ క్రమంలో డిఫాల్ట్‌ బెయిల్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. మరోవైపు.. లిక్కర్‌ స్కాం కేసులో కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై కూడా కోర్టు విచారణ చేపట్టనుంది. 

Share this post