ముందు రోజు రాత్రే సీఐని వీఆర్‌కు పంపిన ప్రభుత్వం ..

cbnn-26.jpg

తిరుపతి ఈస్ట్‌ పోలీసులకు టీటీడీ బుధవారం ఫిర్యాదు చేసింది. అయితే ఆ ముందు రోజే అంటే మంగళవారం రాత్రే తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ మహేశ్వర్‌రెడ్డిని ప్రభుత్వం హఠాత్తుగా వీఆర్‌ కు పంపించింది. ఆయన స్థానంలో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ గా ఉన్న తమకు విధేయుడైన ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాస్‌ కు బాధ్యతలు అప్పగించింది. లడ్డూ అంశంపై అక్రమ కేసు నమోదు చేసేందుకు మహేశ్వర్‌ ­రెడ్డి సుముఖత చూపలేదని సమాచారం. దాంతో ఆయన్ని తప్పించి తమకు విధేయుడైన అధికారిని నియమించినట్లు తెలుస్తోంది. పోలీస్‌ స్టేషన్‌ లో నమోదు చేసే ఫిర్యాదులపై విచారణ నిర్వహించాల్సిన బాధ్యత స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌దే.  టీడీపీ ప్రధాన కార్యాలయం చెప్పినట్లుగా దర్యాప్తు పేరిట వేధింపులకు పాల్పడే అధికారిని నియమించుకునేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు స్పష్టమవుతోంది.

Share this post

scroll to top