ఇంత‌కీ ఆ రాళ్ల సంగ‌తేంటి..?

cbn-10.jpg

రాష్ట్రంలో ‘రాళ్ల’ సమస్య వచ్చింది. అవికూడా అత్యంత ఖ‌రీదైన గ్రానైట్ రాళ్లు. ధ‌న‌వంతుల ఇళ్ల‌లో వేసుకునే రాళ్లు. ఇప్పుడు ఆ రాళ్లను ఏం చేయాలో తెలియ‌క చంద్ర‌బాబు స‌ర్కారు త‌ల‌పట్టుకుంది. పోనీ వదిలేద్దామంటే రూ.350 కోట్లు పెట్టి జ‌గ‌న్‌ ప్రభుత్వం కొనుగోలు చేసింది. అలాగ‌ని వాడ‌దామంటే.. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేశారు. దీంతో ఆ రాళ్ల వ్య‌వ‌హారం ఇప్పుడు స‌ర్కారుకు చిక్కుముడిగా మారింది. ఇంత‌కీ ఆ రాళ్ల సంగ‌తేంటి? వాటి వెనుక ఉన్న నిజాలేంటి? అప్ప‌టి సీఎం జ‌గ‌న్ తెలివి ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది.

జగన్‌ బొమ్మతో ఉన్న స‌ర్వే రాళ్ల వ్య‌వ‌హారం 2022లో పెద్ద దుమారం రేపింది. రాళ్ల‌పై బొమ్మ‌లేంట‌ని అప్ప‌ట్లో చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. గత ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టింది. ఈ సర్వే అనంత‌రం స‌రిహ‌ద్దులు నిర్ణ‌యించి బూముల్లో వీటిని పాతాల‌ని నిర్ణ‌యించారు. అప్ప‌టి గ‌నుల శాఖ డైరెక్ట‌ర్ వెంక‌ట‌రెడ్డి సూచ‌న‌ల మేర‌కు ఇలా 350 కోట్ల‌ను ఖ‌ర్చు చేసి జ‌గ‌న్ త‌న బొమ్మ‌లు వేసుకున్నార‌న్న ప్ర‌చారం ఉంది. సుమారు ఏడు వేల గ్రామాల్లో ఇప్పటికే రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, రీ సర్వే పూర్తయింది. ఇంత‌లో స‌ర్కారు మారి చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చింది. అయితే, రీ సర్వేకోసం తెచ్చిన హద్దు రాళ్లపై జగన్‌ బొమ్మ ఉండటంతో ఈ రాళ్లను ఏమి చేయాలో ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు.

Share this post

scroll to top