ఇవాళ హైదరాబాద్‌కు చంద్రబాబు.. బైక్ ర్యాలీకి టీటీడీపీ ప్లాన్..

cbn-05.jpg

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి హైదరాబాద్‌కు చంద్రబాబు వస్తున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలకాలని టీటీడీపీ నిర్ణయం తీసుకుంది. సాయంత్ర 5గంటలకు బేగంపేట్‌కు చంద్రబాబు చేరుకుంటారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి జూబ్లీహిల్స్ నివాసం వరకూ బైక్ ర్యాలీకి టీటీడీపీ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలో పసుపు తోరణాలు, స్వాగత ఫ్లెక్సీలు, బతుకమ్మ, బోనాలు, డీజేలు సిద్ధమయ్యాయి. రేపు ప్రజాభవన్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు సమావేశం కానున్నారు. మరోవైపు ఆదివారం ఉదయం 11గంలకు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌కు రానున్నారు. చంద్రబాబుతో ఎన్టీఆర్ భవన్‌లో ఆ పార్టీ నేతల ఆత్మీయ సమ్మేళనం జరగనుంది. టీటీడీపీ నూతన అధ్యక్షుడు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదుపై తెలంగాణ నేతలతో చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి హైదరాబాద్ మొత్తం చంద్రబాబు రాక నేపథ్యంలో పసుపు మయంగా మారింది.

Share this post

scroll to top