ప్రజావేదిక నుంచి ప్రారంభం కానున్న చంద్రబాబు అమరావతి పర్యటన..

chandrababu-20.jpg

అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నడుం బిగించారు. ఈ క్రమంలోనే నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటించనున్నారు. రాజధాని రాష్ట్రానికి.. అద్భుతమైన రాజధాని సిద్ధం కానుంది. ప్రజా వేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించనున్నారు. తొలి పర్యటనగా నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం.. రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్, ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాంతం, నిలిచిపోయిన ఐఏఎస్‌లు, మంత్రులు, న్యాయమూర్తుల భవనాలను చంద్రబాబు పరిశీలించనున్నారు.

Share this post

scroll to top