సీఎం చంద్రబాబు సోదరుడి ఆరోగ్యం విషమం..

cm-brother-16.jpg

సీఎం చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్‌ తగిలింది. సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రామ్మూర్తి అనారోగ్యం కారణంగా వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని AIG ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని సమాచారం. విషయం తెలుసుకున్న లోకేశ్ గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు. సీఎం కూడా ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకుని హైదరాబాద్ వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలోనే ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు. ఢిల్లీలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు.. కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్‌, జైశంకర్‌ను కలుస్తారు. అనంతరం నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు వెళతారు. కానీ ఇంతలోనే తన సోదరుడి విషయం తెలిసింది. దీంతో హైదరాబాద్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది బాబు.

Share this post

scroll to top