సీఎం సహాయనిధికి సాయం చేయండి..

cbn-3.jpg

కృష్ణా జిల్లాను వర్షాలు, వరదలు ముంచెత్తాయి. కాలనీలకు కాలనీలే మునిగిపోయాయి. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. బెజవాడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కొందరు పైఅంతస్థుల్లో తలదాచుకుంటున్నారు. మరికొందరు ఇళ్లను వదిలేసి సమీప ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. అజిత్ సింగ్‌ నగర్‌, కండ్రిగ ప్రాంతాలను వరద ముంచెత్తింది. ట్రాక్టర్లు, ప్రొక్లెయినర్లతో వరద బాధితులను తరలిస్తున్నాయి. దశాబ్దాల తర్వాత ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. విజయవాడను రికార్డు స్థాయి వర్షాలే ముంచేశాయి. భారీ వానతో విజయవాడ దాని పరిసర ప్రాంతాలన్నీ నీళ్లలో మునిగిపోయాయి.

వరద బాధితులను ఆదుకునేందుకు మంచి మనసుతో ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎవరికి తోచిన విధంగా వారు సీఎం సహాయనిధికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంధంగా ముందుకు రావాలని ప్రభుత్వం ఈ మేరకు పిలుపునిచ్చింది. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక పాయింట్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

Share this post

scroll to top