ఏపీ సీఎం చంద్రబాబుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మధురానగర్ రైల్వే ట్రాక్‌పైకి సీఎం చంద్రబాబు వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో ట్రాక్ పైకి ట్రైన్ వచ్చింది. ట్రైన్‌ను చూసి వెంటనే సీఎం సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. కార్యకర్తలు లైన్‌మెన్‌ను తీసుకొచ్చి ఎర్రజెండా ఊపడంతో ట్రైన్ ఆగింది. చంద్రబాబుకు సరిగ్గా 3 అడుగుల దూరంలో రైలు నిలిచింది. బుడమేరు ప్రవాహం సరిగా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు చంద్రబాబు. అదే సమయంలో ట్రైన్ రావడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. అయితే, రైలు నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్లైంది. సీఎం చంద్రబాబు సేఫ్ గా ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
చంద్రబాబుకు తృటిలో తప్పిన పెను ప్రమాదం..
