సీఎం చంద్రబాబు రేపు అమరావతి పనులకు శంకుస్థాపన..

cbn-10.jpg

రాజధాని అమరావతి లో నిర్మాణాల పున:ప్రారంభానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో బిడ్ల పరిశీలనతో పాటు కాంట్రాక్టర్లతో లెటర్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తవగానే ఈ నెలాఖరు నాటికి పనులు పునఃప్రారంభం కానున్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పనులను కూటమి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించినట్లు అవుతుంది.

ఈ పనుల ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాజధాని పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12 నుంచి పలు ప్రైవేట్ సంస్థలు తమ నిర్మాణాలను విస్తరించనున్నాయి. ఎస్‌ఆర్‌ఎంలో రూ.700 కోట్లతో కొత్త విభాగాల నిర్మాణం, విట్‌లో వసతి గృహాలు, అకడమిక్ భవనాల ఏర్పాటుతో పాటు 4 కొత్త భవనాలు నిర్మించేందుకు అమృత్ వర్సిటీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ తరుణంలో మార్చి 12 నుంచి 15 లోపు పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం.

Share this post

scroll to top