400 కోట్లు విరాళాలుగా సీఎం సహాయ నిధికి..

cbn-25-.jpg

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ని అతలాకుతలం చేసిన వర్షాలు, వరదల కారణంగా లక్షల మంది నిరాశ్రయులయ్యారని, కానీ వారిని ఆదుకోవడానికి అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు వేశామని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. వరద బాధితుల సహాయార్థం ప్రజల నుంచి విరాళాలు కావాలని పిలుపునిస్తే.. ఏకంగా రూ.400 కోట్లు విరాళాలుగా సీఎం సహాయ నిధికి అదించారని, ఇది నిజంగా ఓ చరిత్ర అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు గానూ విజయవాడ వేదికగా బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒక్కటై పనిచేయగలిగాం. ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే.. మరోవైపు బుడమేరు నీరు పోటెత్తింది. అధికార యంత్రాంగంతో పాటు నేను స్వయంగా బురదలో దిగాను. తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడగలిగాం. సీఎం సహాయ నిధికి రూ.400 కోట్లు వచ్చాయి. ఇది నిజంగా ఓ అద్భుత చరిత్ర’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం వరద నష్టంపై అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

Share this post

scroll to top