కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహారంపై సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు. కొందరు చేసే తప్పిదాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. ఒకరిద్దరు చేసే తప్పులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదే అన్నారు. కేబినెట్ భేటీలో మంత్రుల పని తీరుపై సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. 100 రోజుల తర్వాత ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని చెప్పారు. జనసేన మంత్రుల రిపోర్ట్ పవన్ కళ్యాణ్ కు అందచేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఈ సందర్భంగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యవహరించడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొందరు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. ఒకరిద్దరు చేసే తప్పుల వల్ల ప్రభుత్వం చేసే మంచి పక్కకు పోయి చెడ్డ పేరే హైలెట్ అవుతోందంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.