యువతకు సీఎం చంద్రబాబు భారీ కానుక..

cbn-11.jpg

ప్రస్తుతం నడుస్తున్నది సోషల్ మీడియా యుగం. అరచేతిలో ఫోన్ అందులో ప్రపంచం ఇమిడిపోవడంతో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే. పక్కవారితో మాటలకన్నా చేతిలో ఫోన్ పట్టుకొని అందులో విషయాలను తెలుసుకోవడానికే అందరూ ప్రాధాన్యతనిస్తున్నారు. అంతటి ప్రాధాన్యత ఉన్న సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు ఎలా ఉపయోగించుకుంటున్నాయో మనం చూస్తున్నాం. ఒకరకంగా పార్టీ విజయాలకు కూడా ఇవి కారణమవుతున్నాయి.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రుల పేషీల్లో కొత్త సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ లను నియమించాలని నిర్ణయించింది. అలాగే వీరికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లను కూడా నియమించనుంది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 24 మంది ఎగ్జిక్యూటివ్ లను, 24 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లను తీసుకోబోతున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎంపిక చేసి నెలకు రూ.50వేల వేతనం ఇస్తారు. వీరికి అర్హతగా బీటెక్ లేదా బీఈని ప్రభుత్వం నిర్ణయించింది.


Share this post