రోశయ్య వల్లే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ సీఎం రోశయ్య 3వ వర్థంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ట్రబుల్ షూటర్‌గా రోశయ్య కీలక పాత్ర పోషించబట్టే వైఎస్సార్ పని ఈజీ అయ్యేదని తెలిపారు. రోశయ్య ఉన్నప్పుడు నెంబర్-2 ఆయనే నెంబర్ 1 మాత్రమే మారేవారని తెలిపారు. నెంబర్ 2లో ఉన్నా ఆయన ఎప్పుడూ తన పైన ఉన్నవారిని దాటిపోవాలని అనుకోలేదని సీఎం అన్నారు. ఏరోజు కూడా తనకు ఈ పదవి కావాలని రోశయ్య అడగలేదని సీఎం అన్నారు. పార్టీ పట్ల నిబద్ధత, క్రమశిక్షణ వల్లనే ఆయనకు పదవులు వచ్చాయని తెలిపారు. 2007లో నేను శాసన మండలిలో సభ్యుడుగా ఉన్నప్పుడు నాకు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు.