ప్రపంచదేశాలు భాగ్యనగరం వైపు..

ravanth-6.jpg

ఏ దేశమైనా హైదరాబాద్‌ను ఓ రోల్‌ మోడల్‌గా తీసుకోవాలంటోంది అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం.హైదరాబాద్‌ని అంతర్జాతీయ నగరంగా మార్చడమే ధ్యేయంగా ముందుకెళ్తోంది. అందులోభాగంగానే హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ ప్రాజెక్టులో భాగంగా పలు ఫ్లై ఓవర్ల నిర్మాణాలు, రోడ్ల విస్తరణకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 5,942 కోట్ల రూపాయల నిధులకు పరిపాలన అనుమతులు ఇస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే టెండర్లు పిలిచి ఈ నిధులతో పనులను చేపట్టనున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆరు జోన్లలో 5 ప్యాకేజీల కింద పనులను చేపట్టనున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ జోన్‌లోని ఏవోసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం కోసం అత్యధికంగా 940 కోట్ల రూపాయలు విడుదలకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. శేరిలింగంపల్లి జోన్‌లో ఖాజాగూడ, ఐఐఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ల అభివృద్ధికి రూ. 837 కోట్లు, మియాపూర్‌ ఎక్స్ రోడ్డు నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్డు వరకు ఆరు వరుసల ప్లైఓవర్, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు మూడు వరుసలతో అండర్ పాస్ నిర్మాణానికి రూ.530 కోట్లు విడుదల చేసింది. ఇటు ఖైరతాబాద్ జోన్ పరిధిలో రేతిబౌలి నుంచి నానల్ నగర్ జంక్షన్ వరకు మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.398 కోట్లు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Share this post

scroll to top