హైడ్రా దూకుడుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రేటర్ పరిధిలో చెరువులను కబ్జా చేసిన ఎవర్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ వాళ్ళ నిర్మాణాలనూ హైడ్రా కూల్చివేసిందని, మొదటగా తమ పార్టీకి చెందిన పళ్ళం రాజు ఫామ్ హౌజ్‌నే కూల్చారన్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితం అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ORR బయట ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలోనే ఉన్నాయని మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో క్లారిటీ ఇచ్చారు. Ftl, బఫర్ జోన్ లో తన కుటుంబ సభ్యులు, బంధువుల నిర్మాణాలు ఉంటే వివరాలు ఇవ్వండి తానే వచ్చి దగ్గర ఉండి కూల్చివేయిస్తా అన్నారు సీఎం రేవంత్.
హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితం..
