నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ..

ravanth-31.jpg

భూమిపూజ చేయనున్నారు. ఉదయం 11.54 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ పాల్గొననున్నారు. దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఈ ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం దవాఖాన అఫ్జల్‌గంజ్‌లో ఉండగా నూతన భవనాన్ని గోషామహల్‌ స్టేడియంలో నిర్మించబోతున్నారు. రెండు వేల పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ భవనం కార్పొరేట్‌ హస్పటల్స్ ను తలదన్నేలా ప్రభుత్వం నిర్మించాలని ప్లాన్ చేస్తుంది.

Share this post

scroll to top